- సిటీలోని రోడ్ల వెంట చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు
- ఇందుకోసం టీఎస్ ఆర్ఈడీసీఓతో ఒప్పందం
- దశలవారీగా 230 చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయం
- ఇప్పటికే 46 లొకేషన్లలో ఏర్పాటు..
- హెచ్ఎండీఏ పరిధిలో మరో 100 ఏర్పాటుకు ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్పరిధిలో ఎలక్ట్రిక్వెహికల్స్ ను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. సౌండ్, ఎయిర్పొల్యూషన్తగ్గించేందుకు కృషి చేస్తోంది. సిటీ రోడ్ల వెంట ఈ–వెహికల్స్ చార్జింగ్స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర నోడల్ ఏజెన్సీ అయిన టీఎస్ ఆర్ఈడీసీఓ(తెలంగాణ స్టేట్రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్కార్పొరేషన్లిమిటెడ్తో ఒప్పందం చేసుకుంది. వెహికల్స్మూవ్మెంట్ఎక్కువగా ఉండే రోడ్లను బల్దియా అధికారులు గుర్తించారు. ఆయా రూట్లలో మొత్తం 230 చార్జింగ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బల్దియాతోపాటు హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో 100 లొకేషన్లలో ఈవీ చార్జింగ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ప్రస్తుతం బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో స్టేషన్లో ఫాస్ట్ స్పీడ్ తోపాటు, స్లో స్పీడ్చార్జింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన చోట్ల ఫీజిబిలిటీని బట్టి చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో ఇప్పటికే 46 లొకేషన్లలో చార్జింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. మిగతాచోట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి వెహికల్స్చార్జింగ్కు ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక చార్జీలు ఫిక్స్చేస్తారని తెలుస్తోంది.
సిటీలో 80 వేల ఈవీలు
ప్రస్తుతం సిటీలో 80 వేలకిపైగా ఎలక్ట్రిక్వెహికల్స్ ఉన్నాయి. కొత్తగా ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా చార్జింగ్గురించే ఆలోచిస్తున్నారు. ఎక్కడెక్కడ చార్జింగ్పాయింట్లు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే జనాల్లో ఈవీల వినియోగం, ఉపయోగాలపై అవగాహన పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్రేట్లు పెరిగిపోతుండడంతో ఈవీల వైపు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో వినయోగం మరింత పెరిగే అవకాశం ఉంది.
మొన్నటిదాకా సీఎన్జీ వెహికల్స్కొనేందుకు చాలా మంది ముందుకొచ్చారు. అయితే ప్రస్తుతం సీఎన్జీ రేటు పెట్రోలు, డీజిల్మాదిరిగా రూ.90 దాటడంతో ఈవీల వైపు మళ్లుతున్నారు. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగేటోళ్లు ఎలక్ట్రిక్వెహికల్స్ వాడుతున్నారు. సిటీలో చార్జింగ్ సెంటర్ల సంఖ్య పెరిగితే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్కొనేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. 2030 నాటికి ఎలక్ట్రిక్వెహికల్స్ వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక పాలసీ రూపొందించింది.
మొత్తం 330 చార్జింగ్ స్టేషన్లు
జీహెచ్ఎంసీ పరిధిలో 230, హెచ్ఎండీఏ పరిధిలో 100 చార్జింగ్స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఈ– వెహికల్స్సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ, టీఎస్ ఆర్ఈడీసీఓ సంయుక్తంగా దశలవారీగా ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టేషన్లలో ఫాస్ట్ చార్జింగ్ డీసీ-001(15కేవీ) కెపాసిటీతో ఒక గన్చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 122-150 కేడబ్ల్యూ చార్జింగ్సామర్థ్యంతో టీఎస్ఆర్ఈడీసీఓ 2 రెండు చొప్పున ఏర్పాటు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత మిగిలిన చోట్ల చార్జింగ్స్టేషన్ల ఏర్పాటుపై జీహెచ్ఎంసీ, టీఎస్ఆర్ఈడీసీఓ నిర్ణయం తీసుకోనున్నాయి.