హైదరాబాద్ : కొండాపూర్ జేవీజీ హిల్స్ కు సంబంధించిన పార్క్ స్థలంలో అక్రమంగా వెలసిన గుడిసెలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టింది. పార్క్ స్థలంలో అక్రమంగా దాదాపు 25 గుడిసెలు ఉన్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు నడుమ అధికారులు గుడిసెలను తొలగిస్తున్నారు.
జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ గుడిసెల తొలగింపు ప్రక్రియను స్థానిక బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ అడ్డుకున్నారు. ఉన్నట్టుండి బాధితులను రోడ్డున పడేస్తే వారి పరిస్థితి ఏంటని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. గుడిసెలలో ఉంటున్న బాధితులకు పక్కా ఇళ్ళు ఇవ్వాలని రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.