మేడ్చల్ జిల్లా నేరెడ్ మెట్ కాకతీయ నగర్ కు చెందిన చిన్నారి సుమేధ కోసం జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసుల టీమ్ నాలాల్లో వెతుకుతున్నాయి. ఐదో తరగతి చదువుతున్న సుమేధ నిన్న సాయంత్రం సైకిల్ పై బయటకు వెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నాలాలో ఆమె సైకిల్ బయటపడింది. దీంతో అక్కడే గాలిస్తున్నారు.
భారీ వర్షానికి హైదరాబాద్ లోని నాళాలు పొంగిపొర్లుతున్నాయి. నిన్న బయటకు వెళ్లిన సుమేధ నాలాలో పడిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. నాలాలో సుమేధ సైకిల్ దొరకడంతో అనుమానాలను మరింత బలపరుస్తోంది. దీంతో ఉదయం నుంచి నాలాలోనే వెతుకుతున్నారు.