బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉన్న15 పదవులకు 15 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడంతో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం సోమవారం ప్రకటించింది. మొదట బీఆర్ఎస్ నుంచి10 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు, కాంగ్రెస్​ నుంచి ఇద్దరు నామినేషన్లు వేయడంతో కొందరు కార్పొరేటర్లు టెన్షన్​పడ్డారు. చివరకు కాంగ్రెస్​కు చెందిన ఇద్దరు, బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లను విత్​డ్రా చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు స్టాండింగ్​కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 

వీరిలో బీఆర్ఎస్​ కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, కంది శైలజ, చింతల విజయశాంతి, అర్చన, బన్నాల గీత, మన్నె కవితారెడ్డి, సబీహా బేగం, ఎంఐఎం కార్పొరేటర్లు మహ్మద్ గౌస్ ఉద్దిన్, ఫహద్ బిన్ అబ్దుల్ సమీద్ బిన్ అబ్దాత్, మహ్మద్ ఖాదర్, మహ్మద్ నసీరుద్దిన్, మహ్మద్ ముజాఫర్ హుస్సేన్, రఫత్ సుల్తానా, షహీన్ బేగం ఉన్నారు.