హైదరాబాద్, వెలుగు : నగరంలోని పలు మార్గాల్లో ఉన్న రోడ్లను విస్తరిస్తూ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో 27 ఎజెండా అంశాలను చర్చించి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు 3 ఏళ్ల కాలానికి 22 మాడ్యుల్స్కు రూ.5.9 కోట్లు చెల్లించుటకు ఆమోదం తెలపగా… హెల్త్ ఆఫీసర్లు నిర్వహిస్తున్న శానిటేషన్ బాధ్యతలను ఎన్విరాన్మెంట్ ఇంజినీర్లు, మున్సిపల్ ఇంజినీర్లకు బదిలీ చేశారు. అదేవిధంగా వైద్యాధికారులు, హెల్త్ అసిస్టెంట్లకు శానిటేషన్ విధుల నుండి మినహాయించగా, ఫుడ్ సేఫ్టీ, బస్తీ దవాఖానాలు హెల్త్ రిలేటెడ్ అంశాల విధులను కేటాయించారు. జీహెచ్ఎంసీ క్రీడా ప్రాంగణాల్లో మంత్లీ మెంబర్షిప్ రేట్లను పునర్వ్యవస్థీకరించుట, లీగల్ అడ్వైజర్ సేవలను ఒక సంవత్సరం పాటు పొడిగింపు. టౌన్ప్లానింగ్ విభాగం హెడ్ ఆఫీస్తో పాటు ఖైరతాబాద్ సర్కిల్ -14 కార్యాలయం ఆధునీకరణకు ఆమోదం. పటాన్ చెరువు సర్కిల్ 22లో 41 మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లింపునకు ఆమోదం తెలిపారు. డీఆర్ఎఫ్ కు హయత్ నగర్, ఫతుల్లగూడలో స్థలాన్ని కేటాయించగా, వివిధ పార్కులలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ఒక కేటగిరికి చేర్చి పునర్ వ్యవస్థీకరణ. ట్రాన్స్ పోర్ట్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్ లు, లేబర్ ను ఆఫీసర్, వర్కర్ కేటగిరిలుగా చేసే విధంగా అమోదం తెలిపారు.
విస్తరించనున్న రోడ్లు ఇవే…
- నాచారం– మల్లాపూర్ ప్రతిపాదిత మౌలాలి ఫ్లైఓవర్ వరకు 30 మీటర్లు వెడల్పుతో రోడ్డు విస్తరణ
- మూసీపై జియాగూడ – కిషన్ బాగ్ మధ్య 18 మీటర్లు బ్రిడ్జి నిర్మాణం
- అరబిందో నవయుగ సెజ్ నుంచి వయా నార్నే లే అవుట్ మీదుగా చందానగర్ రైల్వే స్టేషన్ రోడ్ వరకు 45 మీ. వెడల్పుతో రోడ్డు విస్తరణ
- హైటెక్ సిటీ ఫేస్-2 నుండి గచ్చిబౌలి ఇనార్బిట్ రోడ్ వరకు, బయోడైవర్సిటీ హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు నుండి జిహెచ్ఎంసి పార్కు హైటెక్సిటీ రోడ్డు వరకు లింకు రోడ్ల విస్తరణ
- హైటెక్ సిటీ ఎం.ఎం.టి.ఎస్ రోడ్డు జంక్షన్ నుండి వయా అరబిందో ద్వారా గౌసియా మజీద్ రోడ్ వరకు, నోవాటెల్ నుండి ఆర్.టి.ఏ ఆఫీస్ వరకు
- ప్రగతి నగర్ చెరువు నార్త్ నుండి జిహెచ్ఎంసి లిమిట్స్ బోరంపేట వరకు రేడియల్ రోడ్ల నిర్మాణానికి ఆస్తుల సేకరణ.
- మెట్రో సూపర్ మాల్ నుండి వయా హెచ్.టి లైన్ ద్వారా జగద్గిరిగుట్ట జంక్షన్ ఇందిరాగాంధీ విగ్రహం వరకు
- జె.వి హిల్స్ నుండి వయా ప్రభుపాద లేఅవుట్ హెచ్.టిలైన్ మార్గంలో రోడ్డు వరకు
- గోపనపల్లి నుండి వయా ప్రణీత్ప్రనవ్ రోడ్ ద్వారా విప్రో వరకు మదీన మజీద్ హెచ్.పి పెట్రోల్ బంక్ మార్గం వరకు
- క్రాంతివనం లేఅవుట్ నుండి భాగ్యలక్ష్మి లేఅవుట్ ను కలుపుతూ నార్నీ రోడ్డు వరకు
- బాపూఘాట్ బ్రిడ్జి నుండి మూసి రివర్ సౌత్ ప్యారలాల్గా అత్తాపూర్ ఫ్లైఓవర్ వరకు
- మల్కారం చెరువు నుండి వయా చిత్రపురి కాలనీ ద్వారా ఖాజాగూడ మెయిన్ రోడ్ వరకు రోడ్డు విస్తరణ, ఆస్తుల సేకరణ.