
హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు BRS కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. BRS ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం కావడం గమనార్హం. తమకు సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది.
స్టాండింగ్ కమిటీకి MIM నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, BRS నుంచి 2 నామినేషన్లతో కలిపి మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. 15 మెంబర్లు ఉండే స్టాండింగ్ కమిటీకి BRS ఉపసంహరణతో ఎన్నిక లేకుండా MIM, కాంగ్రెస్ సభ్యులతో ఏకగ్రీవం అయింది. 15 స్టాండింగ్ కమిటీ మెంబర్లకు గాను ఎనిమిది మంది MIM, ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు ఉండనున్నారు. గత పదేళ్ల నుంచి మొదటి సారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ కార్పొరేటర్లకు చోటు దక్కింది.
ALSO READ | బీజేపీ ప్రభుత్వానికి..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ సమానమే
గ్రేటర్లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో 39 మంది బీజేపీ, 42 మంది బీఆర్ఎస్, 24 మంది కాంగ్రెస్, 41 మంది ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు.15 మందితో కూడిన స్టాండింగ్ కమిటీని ఎన్నుకోవాలంటే 74 మంది కార్పొరేటర్లు ఏకపక్షంగా ఉండాలి. గతంలో ఎంఐఎం నుంచి ఏడుగురు, బీఆర్ఎస్ నుంచి 8 మంది సభ్యులతో స్టాండింగ్కమిటీని ఎన్నుకున్నారు.
ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ లేకపోవడంతో ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఏడాది కాలపరిమితి ఉండే స్టాండింగ్ కమిటీలో గత మూడు సార్లు బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులే ఉన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఓడిపోయాక, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి అధికార కాంగ్రెస్ లో చేరారు. వారితోపాటు పలువురు పార్టీ మారారు.