
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం 17 నామినేషన్లు వచ్చాయి. అన్ని నామినేషన్లూ వ్యాలీడ్ అయినట్లు జీహెచ్ఎంసీ కమీషనర్, రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ఫిబ్రవరీ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇద్దరు సభ్యులు నామినేషన్లు విత్ డ్రా చేసుకుంటే కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. లేదంటే 25న ఎన్నికలు నిర్వహించి.. అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.
15 సభ్యుల ఎంపికకు 17 మంది కార్పోరేటర్లు నామినేషన్లు వేయడంతో బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. బల్దియా ప్రస్తుత పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి బీఆర్‌ఎస్–ఎంఐఎంల పరస్పర అవగాహనతో స్టాండింగ్ కమిటీలో నామినేషన్ వేసిన ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఏకగ్రీమవుతూ వస్తున్నారు. ఈసారి అధికార కాంగ్రెస్తో ఎంఐఎం జతకూడడంతో ఈ రెండు పార్టీల కూటమే స్టాండింగ్కమిటీని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే, ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా నామినేషన్ వేయగా, ఇద్దరు నామినేషన్లను విత్ డ్రా చేసుకుంటే తప్పా, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవయ్యే అవకాశాల్లేవు. అయితే, బీఆర్ఎస్గెలిచే అవకాశం లేదు కాబట్టి నామినేషన్వేసిన ఆ పార్టీ కార్పొరేటర్లు ఉపసంహరించుకుంటారని, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవం అవుతారన్న వార్తలు వస్తున్నాయి.