ఇన్​కమ్​పై బల్దియా నజర్..​  300 కోట్లు టార్గెట్​

కమర్షియల్, నాన్​కమర్షియల్ ఏరి యాల్లో ఇండ్లకు పర్మిషన్​ పొంది బిజినెస్​లు చేస్తున్న వారి నుంచి బల్దియాకు అప్లికేషన్లు వస్తున్నాయి. శుక్రవారం వరకు 30 సర్కిళ్లలో సుమారు 1,500 దాకా సెల్ఫ్​డిక్లరేషన్​ చేసుకున్నారని ఆఫీసర్లు చెప్పారు. గడువులోపు ఎక్కువగానే అప్లికేషన్​లు రావొచ్చని అంటున్నారు. వెబ్​సైట్​ https://cr.ghmc.gov.in లోకి వెళ్లి సెల్ఫ్​డిక్లరేషన్​ఇచ్చి ఫీజు కట్టినా చాలని సూచిస్తున్నారు.  గడువు దాటినంక డిక్లరేషన్​ఇవ్వని వారిపై రూల్స్​మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తు న్నారు. ఇండ్ల  అవసరాలకు పర్మిషన్లు తీసుకుని బిజినెస్​లు చేస్తున్న వారికి ఇది వర్తిస్తుందని చెప్పారు. 

హైదరాబాద్​, వెలుగు:  వేల కోట్ల అప్పుల్లో ఉన్న బల్దియా ఇన్​కమ్ పెంచుకునేందుకు సిటీలో కమర్షియల్,​ నాన్​కమర్షియల్​ ఏరియాల్లో రెసిడెన్షియల్​పర్పస్​గా పర్మిషన్లు తీసుకున్న వారిపై ఫోకస్​చేసింది. నాలుగునెలల కిందట కొత్తగా గుర్తించిన కమర్షియల్​ రోడ్లలోని ఇండ్లకు ఇంపాక్ట్​(ప్రభావ) ఫీజు వసూలు చేసేందుకు రెడీ అయ్యింది.  రెసిడెన్షియల్​ నుంచి కమర్షియల్​గా మార్చుకోవాలనుకునే ఓనర్లకు పర్మిషన్ ​ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇండ్లలో హోటళ్లు, బ్యాంకులు, కిరాణ కొట్లు, మెడికల్​షాపులు, బేకరీలు.. ఇలాంటివి కొనసాగుతుంటే వాటికి సర్టిఫికెట్ ​పొందేందుకు బల్దియా రూల్స్​రూపొందించింది. ఆన్​లైన్​లో పర్మిషన్​తీసుకోవాలంటే ఓనర్లు సెల్ఫ్​డిక్లరేషన్​ఇవ్వాలి ఉంటుంది. సంబంధిత ల్యాండ్ ​రిజిస్ట్రేషన్ ​వాల్యూ ప్రకారం ఫీజు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈనెల 31లోపు నిర్ణీత ఫీజు చెల్లించి పర్మిషన్​ తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత తీసుకోనివారిపై  వచ్చే జనవరి1 నుంచి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. గ్రేటర్​లోని 30 సర్కిళ్లల్లో ఇంపాక్ట్ (గుర్తించిన రోడ్ల వెంట ప్రభావ)​, కంపౌండింగ్​(కమర్షియల్​గా గుర్తించని రోడ్ల వెంట ఉండే వాటికి కూడా ) ఫీజుల ద్వారా వందల కోట్లలో ఆదాయం​రావొచ్చని బల్దియా అధికారులు అంచనా వేశారు.  

కమర్షియల్​గా గుర్తించిన రోడ్లలో..
సిటీలో కొత్తగా మరో 111 రోడ్లను కమర్షియల్​గా గుర్తిస్తూ గత జులైలో జీవో రిలీజైంది.  దీని ప్రకారం కమర్షియల్, నాన్​ కమర్షియల్​ఏరియాల్లో ఇండ్లకు పర్మిషన్లు తీసుకోగా, వాటిని వాణిజ్య అవసరాలకు మార్చుకుని,  బల్దియాకు ఇంటి లెక్కనే పన్ను చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు వీటిపై బల్దియా అధికారులు దృష్టి పెట్టలేదు.  తాజాగా మార్చుకున్న వారు ఇంపాక్ట్​, కంపౌండింగ్​ఫీజు చెల్లించి మార్చుకునే  అవకాశం కల్పించింది.  కమర్షియల్​కారిడార్లుగా గుర్తించిన రోడ్లలో జీ ప్లస్​ 1 ఉండి షాపులు నడిపితే వాళ్లు రిజిస్ట్రేషన్​వాల్యూలో 6 శాతం, లేదా రూ. 300 ఏది ఎక్కువైతే అది ఇంపాక్ట్​ ఫీజుగా చెల్లించాలి. జీ ప్లస్​2 అంతకన్నా ఎక్కువైతే చదరపు అడుగుకు 3 శాతం (రిజిస్ట్రేషన్​ వాల్యూ), లేదా రూ. 150  ఏది ఎక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుంది.   స్కూళ్లు, ఆస్పత్రులు, నర్సింగ్​హోమ్ లు ఉంటే ఇంపాక్ట్​ ఫీజు ఇంకా తక్కువగా ఉంటుంది. వీటికి సెల్ఫ్​ డిక్లరేషన్​టైమ్​లోనే 50శాతం ఫీజు చెల్లించాలి. మిగతా సగం వచ్చే మార్చి31లోపు చెల్లించాలి. ఒకేసారి చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్​ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  కారిడార్లుగా గుర్తించిన ఏరియాల్లో  బిజినెస్​లు చేస్తున్నవారు కూడా కమర్షియల్​గా మార్చుకునేందుకు అవకాశం ఉంది. పన్నులో 1.25 శాతం నుంచి 1.50శాతం అధికంగా ఒకేసారి కాంపౌండింగ్​ఫీజు చెల్లించి మార్చుకోవచ్చు. 

వచ్చే ఆదాయాన్ని.. 
ఇంపాక్ట్​, కంపౌండింగ్​ ఫీజుల ద్వారా రూ. 300 కోట్ల వరకు ఇన్​కమ్ ​రాబట్టేందుకు బల్దియా అంచనా వేసింది. వచ్చే ఆదాయాన్ని నాలాల విస్తరణ చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. సర్కిళ్లలోని జనాలకు అవగాహన లేకపోగా చాలామందిలో అయోమయం నెలకొంది. దీనిపై బల్దియా సరైన సమాధానాలు  చెప్పడంలేదు. నాన్​కమర్షియల్​గా ఉపయోగిస్తూ తక్కువ ఫీజుతో కమర్షియల్​గా మార్పు చేసుకోవచ్చనే విషయం చాలామందికి తెలియదు. మార్చుకుంటే ఎక్కువ పన్నులు కట్టాల్సి వస్తుందేమోననే భయం వారిలో ఉంది.  అన్ని సర్కిళ్లల్లోని ఆఫీసర్లు ముందుగా జనాలకు అవగాహన కల్పించాల్సి అవసరం ఉంది.