రూ. 8 వేలు లంచం తీసుకుంటుగా జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్ రాధాకృష్ణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్లాట్ ఓనర్షిప్ చేంజ్ చేసేందుకు సరూర్ నగర్ సర్కిల్ ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్ రాధాకృష్ణ రూ. 8వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో చేసేది ఏమీ లేకా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా స్కెచ్ తో మార్చి 11వ తేదీ సోమవారం రోజున రాధాకృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. రాదాకృష్ణను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏసీబీ అధికారులు.