ఆ 30 ప్రాంతాల్లో చేతులెత్తేసిన GHMC

ఆ 30 ప్రాంతాల్లో చేతులెత్తేసిన GHMC
  • మోటార్లతో నీళ్లు ఎత్తిపోయడమే దారంటున్న బల్దియా
  •  కోట్లు ఖర్చు చేస్తున్నా ఇబ్బందులే
  • ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ప్రాబ్లమ్

 

తొలకరి వానలకే సిటీ చిత్తడవుతోంది. నీట మునిన రోడ్లపై ట్రాఫిక్ జాంతో నరకంకనిపిస్తోంది. మాన్సూన్ యాక్షన్ పేర ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రాబ్లమ్ రిపీట్ అవుతూనే ఉంది. అర గంట జర్నీకి 6 గంటలు పట్టిన సందర్భాలు తీవ్రతను హెచ్చరించినా ప్రయోజనం ఉండడం లేదు. 30 ఏరియాల్లోవరద నీటిని ఎత్తిపోయడం తప్ప ఏం చేయలేమంటూ బల్దియా చేతులెత్తేస్తోంది.

ఆక్రమణలతోనే ప్రాబ్లమ్

రెయిన్ సీజన్లో భాగంగా సిటీలో ట్రాఫిక్‌‌, రెసిడెన్షి యల్ ఏరియాల్లోవాన నీళ్లునిలిచే 157 ఏరియాలను బల్దియా గుర్తించింది. 127 చోట్ల ప‌‌నులు కంప్లీట్ చేసినట్లు చెప్తోంది. మిగిలిన 30 ప్రదేశాల్లో మాత్రం ఇంజి నీరింగ్ అధికారులు చేతులెత్తేశారు. అక్కడ వాన నీటిని మోటార్లతో ఎత్తిపోయడం తప్ప వేరే శాశ్వత పరిష్కార మార్గం లేదని తేల్చిచెప్పారు. చెరువులకు దగ్గరగా ఉన్న మార్గాల్ లోనే సమస్య వస్తోందని ఓ అధికారి తెలిపారు. వర్షంకురిసినప్పుడు ఆ నీరంతా ఫీడర్ చానళ్లద్వారా చెరువుల్లోకి వెళ్లాల్సి ఉంది. బిల్డింగ్స్ కన్సక్షన్ టైమ్ లో అవన్నీ ఉనికిని కోల్పోగా చెరువులకు సమీప ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలుస్తోంది.

ఇవే ఆ ఏరియాలు

హబ్సిగూడ(మోడర్న్ ‌బేకరి), నాగోలు(ఆదర్శన్‌ ‌నగర్‌‌ కాలనీ), మలక్‌‌పేట(ఆర్‌‌యూబీ), యాకుత్‌‌పురా(ఆ ర్‌‌యూబీ), చాంద్రాయణగుట్ట(వలీ ఫంక్షన్‌‌హాల్‌‌), న్యూ అఫ్జల్‌‌ నగర్‌‌, దత్తాత్రేయ కాలనీ(న్యూ బైటెక్ ‌రోడ్‌‌), కరోల్‌‌బాగ్‌‌, టోలీ చౌకి(హెచ్‌‌ఎస్‌‌రెసిడెన్సీ), నదీమ్‌‌ కాలనీ కల్వర్ట్, ‌జమాలీకుంట ఔట్ లెట్‌‌, బేగంబజార్‌‌ పీఎస్ ఎదుట, రంగ్‌‌మహల్‌‌, లేక్‌‌వ్యూ గెస్ట్ ‌హౌస్, ఎంఎస్‌‌ మక్తా, బల్కంపేట ఆర్‌‌యూబీ, విల్లామేరీ కాలేజీ ఎదుట, షేక్‌‌పేట ఆదిత్య టవర్‌‌, షేక్‌‌పేట వివేకానంద నగర్‌‌, జూబ్లీహిల్స్ ‌రోడ్‌ ‌నం.44, మాదాపూర్‌ ‌నెక్టార్‌‌ గార్డెన్‌‌ , శిల్పారామం బస్టాప్‌, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌‌ హఫీజ్‌పేట ఫ్లైఓవర్‌ ‌దగ్గర, మాదాపూర్‌‌ డొమినోస్‌ ‌రోడ్‌‌, నింబోలి అడ్డా, యూనివర్సల్‌ ‌స్విమ్మింగ్‌‌పూల్‌‌– షిర్డీనగర్‌, ఒలిఫెంటా బ్రిడ్జి, కర్బలా మైదాన్‌‌, రాణిగంజ్‌ బాంబే హోటల్‌‌ ఎదుట.

ఈ సీజన్ కు24.53 కోట్లున్నా..

ఏటా జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హెచ్ఎం డీఏ, పోలీస్ శాఖలు మాన్ సూన్ ప్లాన్ సిద్ధం చేస్తుంటాయి. ఈసారి రూ.24.53 కోట్లతో ప్లాన్ రెడీ చేశాయి. ముంపు ఏరియాల్లో సహాయక చర్యల కోసం 87 మినీ మొబైల్ టీమ్‌‌లు, 79 మొబైల్ టీమ్‌‌లు, ఒక జోనల్ ఎమ‌‌ర్జెన్సీ టీమ్‌‌, 101 స్టాటిక్ లేబర్ టీమ్‌‌లు ఏర్పాటు చేశారు.