సమస్య సాల్వ్ చేయకుండా క్లోజ్ చేస్తున్నారు

సమస్య సాల్వ్ చేయకుండా క్లోజ్ చేస్తున్నారు

సిటీలో సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీకి వెల్లువెత్తుతున్న సమస్యలు పరిష్కారమవుతున్నా..కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకుండానే క్లోజ్‌ చేస్తున్నారు. ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలంటూ క్షేత్రస్థాయి అధికారులకు అప్పగిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయి అధికారులు మాత్రం సమస్యలను పరిష్కరించకుండానే క్లోజ్‌ చేస్తున్నారు. ప్రజల ఫీడ్‌ బ్యాక్‌
తీసుకుంటూ పరిష్కారం కాని ఫిర్యాదుల్ని రీ ఓపెన్‌ చేస్తున్నారు. ఇకపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని స్వీకరించి, పరిష్కరించేందుకు థర్డ్‌ పార్టీని నియమించనుంది. థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ ద్వారా సమస్యల పరిష్కారంలో కచ్చితత్వం, పాలనలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

విన్నపాల వెల్లువ

గ్రేట ర్ హైదరాబాద్ పరిధిలో మై జీహెచ్‌ఎంసీ యాప్, కాల్ సెంటర్, ప్రజావాణి, ఆన్ లైన్ ల ద్వారా పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయి. వీటిని పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలు, టౌన్‌ ప్లానింగ్‌, డ్రైనేజీ, ఇంజనీరింగ్ అంశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 15 వరకు అందిన లెక్కల ప్రకారం మొత్తం 96,927 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 80,807 ఫిర్యాదులను పరిష్కరించినట్టు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. దీంతో ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో 2,141 ఫిర్యాదులు తిరిగి ఓపెన్
చేశారు. 80 శాతం పరిష్కరించామని అధికారికంగా చెబుతున్నప్పటికీ వాస్తవానికి 50 శాతం మాత్రమే పరిష్కారమవుతున్నట్టు గత లెక్కలు చెబుతున్నాయి.

సమస్య పరిష్కారమైందా?

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారాన్ని హెడ్డాఫీసు నుంచి మానిటర్‌ చేస్తారు. సర్కిళ్ల వారీగా సంబంధిత అధికారులకు అప్పగిస్తారు. ‘ఫలానా అధికారి మీ సమస్యను పరిష్కరిస్తారు’ అంటూ ఫిర్యాదుదారుకు కూడా మెస్సేజ్‌ చేస్తారు. అయితే ఈ ప్రక్రియలో కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సమస్యను పరిష్కరించకుండానే సాల్వ్‌ చేశామంటూ వేరే ఫొటోలు అప్ లోడ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది . ఫిర్యాదు స్టేటస్ ను
కాల్‌ సెంటర్‌ నుంచి అడిగి తెలుసుకున్నప్పుడు అసలు విషయం బయటపడుతోంది . సమస్య పరిష్కారంపై సంతృప్తిగా ఉన్నారా అని అడిగినప్పుడు లేదని చెప్పిన వారి ఫిర్యాదుల్ని తిరిగి ఓపెన్‌ చేస్తారు. అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పిన వివరాల్ని నమోదు చేసుకుంటా రు. దీని ఆధారంగా విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పదే పదే చెబుతున్నప్పటికీ రీ ఓపెన్‌ చేస్తున్న ఫిర్యా దుల సంఖ్యా తగ్గడం లేదు.

నిర్లక్ష్యానికి చెక్‌

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని 100 శాతం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సమీక్ష సమావేశాల్లో చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. టెక్నాలజీ వినియోగంలో జీహెచ్‌ఎంసీ ముందుంటున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ఫిర్యాదుల పరిష్కారం కోసం థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. నగరవాసులు సమస్యలపై వివిధ
మార్గాల ద్వారా చేసే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వా లని అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రజావాణి, మై జీహెచ్ఎంసీ యాప్, ట్వి ట్టర్, మెయిల్స్ సహా వివిధ పద్ధతుల్లో వచ్చే ఫిర్యాదుల్లో దాదాపు 80 శాతానికి పైగా పరిష్కరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. పరిష్కరిం చామని చెబుతున్న వాటిలోంచి పది శాతం ఫిర్యాదులను థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపిస్తారు. వీటిలో అధికారుల నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకునేలా విధివిధానాలు రూపొంది స్తున్నట్టు జీహెచ్‌ఎంసీలోని ఓ అధికారి తెలిపారు.