యాడ్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ వేలల్లో ఫైన్లు

యాడ్ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ వేలల్లో ఫైన్లు
  • బస్టాపుల్లో ఫ్యాన్లు, ఏసీలు బాగుచేయకపోవడంతో చర్యలు
  • ఇకపై ప్రతి సోమవారం ఏసీ బస్టాపుల తనిఖీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏసీ బస్టాపుల నిర్వహణను పట్టించుకోని యాడ్​ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ వేలల్లో ఫైన్లు విధిస్తోంది. బల్దియా పరిధిలోని ఏసీ బస్టాపుల్లో ఏసీలు, ఫ్యాన్లు బాగు చేయాలని మార్చి మొదటి వారంలో ఆదేశాలు జారీ చేసినా యాడ్ ఏజెన్సీలు స్పందించలేదు. మార్చి 24న ప్రత్యేకంగా నియమించిన తనిఖీల్లో ఏజెన్సీలు రిపేర్లు చేయలేదని తేలింది. దీంతో యూనీ యాడ్స్ ఏజెన్సీకి రూ.22 వేలు, ప్రకాష్ ఆర్ట్స్, మీడియా కార్ట్ కి రూ.30 వేలు చొప్పున ఫైన్లు విధించింది.

రిపేర్లకు వారం గడువు ఇచ్చి మంగళవారం తనిఖీ చేయగా ఇంకా పలుచోట్ల ఏసీలు పని చేయలేదని తెలిసింది. దీంతో బుధవారం మరోసారి యూనీ యాడ్స్ కు రూ.46 వేలు, ప్రకాష్ ఆర్ట్స్ కి రూ.61 వేలు-, మీడియా కార్ట్ కి రూ.56 వేలు ఫైన్లు విధించింది. వచ్చే సోమవారం మళ్లీ తనిఖీలు ఉంటాయని, వారం వారం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. యాడ్​ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఫైన్లు మరింత పెరుగుతామని హెచ్చరించారు.