
- 150 వార్డుల్లో కోఆర్డినేషన్ కమిటీల నియామకం
- ఇందులో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ , హైడ్రా సిబ్బంది
- వరద నీరు చేరే ప్రాంతాలపై స్టడీ
- నివారణ చర్యలకు సూచనలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:వచ్చే వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మాన్సూన్యాక్షన్ ప్లాన్ పై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. దీని కోసం 150 వార్డుల్లో ప్రత్యేకంగా కోఆర్డినేషన్ కమిటీలను వేయనున్నది. ప్రతి వార్డులో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ , హైడ్రా అధికారులతో కలిపి ఒక టీమ్ ఏర్పాటు చేయనున్నది. వీళ్లు ఆ వార్డులో ఎక్కడ వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయో తెలుసుకుని, వరదలు వచ్చినప్పుడు ఎక్కడ ఇబ్బందులు ఏర్పడుతాయో గుర్తించి ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది.
మోటార్లు ఏర్పాటు చేయడం, లేదా ఏం చేస్తే అక్కడ సమస్య పరిష్కారమవుతుందో ఆలోచించి...ఆ పనులు బల్దియా, వాటర్‌బోర్డు, ఎలక్ర్టిసిటీ డిపార్టుమెంట్లతో పాటు ఎవరు చేయాల్సి ఉంటుందనే సూచనలు జారీ చేస్తుంది. దీనిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్స్తయారు చేసి బల్దియా, ట్రాఫిక్ ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. వాటల్ లాగింగ్ కి సంబంధించి ఎక్కువగా సమస్య ఉంటే అక్కడ వాటర్ హోల్డింగ్ స్ర్టక్చర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు.
వానాకాలంలోపు హోల్డింగ్ స్ట్రక్చర్లు కష్టమే..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 141 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినప్పుడు నీటిని క్లియర్ చేయడానికి డీఆర్ఎఫ్ బృందాలు ఎన్నో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ నీటిని తొలగించేందుకు గంటల సమయం పడుతోంది. అప్పటి వరకు ట్రాఫిక్ సమస్య తీరడంలేదు. వర్షాకాలంలో కొన్ని లాగింగ్ పాయింట్ల వద్ద పర్మినెంట్ గా మోటార్లు ఉంచిన రోజులు కూడా ఉన్నాయి. అతిభారీ వర్షాలు కురిసినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ నేషనల్ హైవే లాంటి ప్రాంతాల్లో నేటికీ గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయితే, నీళ్లు నిలుస్తున్న కొన్నిచోట్ల వాటర్ హోల్డింగ్ స్ర్టక్చర్లు నిర్మించడంతో ఇబ్బందులు తొలిగాయి. దీంతో మొత్తం 50 చోట్ల వాటర్హోల్డింగ్స్ట్రక్చర్లను నిర్మించాలని అనుకున్నారు. అయితే, ఈ వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయడం కష్టమేనని తెలుస్తోంది. అంతవరకు లాగింగ్పాయింట్స్వద్ద ఈ కోఆర్డినేషన్ టీమ్స్ సాయంతోనే ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు.
మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లివే..
పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్‌ఫ్లై ఓవర్, ధరమ్ కరమ్ రోడ్, బేగంపేట్‌లోని యాక్సిస్‌బ్యాంక్, రాణిగంజ్ లోని కర్బాలా మైదాన్, ఆర్పీ రోడ్, కార్ఖానా రోడ్, కేఎఫ్‌సీ,ఆర్పీ రోడ్‌చిత్రదుర్గ, సైఫాబాద్‌లోని షాదాన్ కాలేజ్, అయోధ్య జంక్షన్, నాంపల్లిలోని పోలీస్‌కంట్రోల్‌రూమ్ జంక్షన్, సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం జంక్షన్, ఆలుగడ్డ బావి, సుల్తాన్‌బజార్‌లోని రంగమహల్, అఫ్జల్‌గంజ్‌సెంట్రల్‌లైబ్రరీ, మలక్‌పేట్‌లోని అక్బర్ ప్లాజా, మలక్‌పేట్ గంజ్, చాదర్‌ఘాట్ రైల్వే ఆర్‌ఓబీ, బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్–12 కమాండ్‌కంట్రోల్‌సెంటర్,పెన్షన్ ఆఫీస్ సిగ్నల్, జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్–36 క్రోమా స్టోర్ తదితర ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్లు మేజర్ గా ఉన్నాయి. వర్షాలు కురిసిన ప్రతిసారి జీహెచ్ఎంసీకి వస్తున్న కంప్లయింట్స్ లో సగానికిపైగా వాటర్ లాగింగ్ కోసమే ఉంటున్నాయి. అవి కూడా ఈ ప్రాంతాల నుంచే వస్తున్నాయి