- ఉదయం 6 నుంచే ఫుట్‌పాత్‌లపై అమ్మకాలు
- జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
గచ్చిబౌలి, వెలుగు: ఆ తోపుడు బండ్లలో బయటకు కన్పించేది చాయ్, బిస్కెట్లు.. కానీ, అమ్మేది మాత్రం లిక్కర్.. పక్కనే ఉన్న గుడిసెల్లో ఒకవైపు సిట్టింగ్ఏర్పాటు చేసి, యథేచ్చంగా బెల్ట్షాప్నిర్వాహణ.. కొండాపూర్ప్రధాన రహదారి ఫుట్‌పాత్‌పై జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతమిది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్జేవీజీ హిల్స్రోడ్డులో ఫుట్‌పాత్‌పై తోపుడు బండ్లు పెట్టి పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం అమ్ముతున్నారని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
స్పందించిన శేరిలింగంపల్లి సర్కిల్డిప్యూటీ హెల్త్ఆఫీసర్శ్రీకాంత్గురువారం తెల్లవారుజామున 6 గంటలకు జేవీజీ హిల్స్ వద్దకు వెళ్లారు. ఫుట్ పాత్మీద ఉన్న ఒక తోపుడు బండిలో 10 విస్కీ క్వార్టర్ బాటిళ్లను గుర్తించి ధ్వంసం చేశారు. ఆ తర్వాత రాజరాజేశ్వరికాలనీ రోడ్డును ఆనుకొని ఓ గుడిసెలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో అక్కడికి చేరుకున్నారు.
ఉదయం 6 గంటలకే మందుబాబులు అక్కడ తాగుతూ కనిపించడంతో గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుడిసెలో ఉన్న 92 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్‌షాప్ నిర్వహిస్తున్న మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.