హైదరాబాద్, వెలుగు: హోటళ్లు క్యారీ బ్యాగులు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన సరిగా అమలు కావడం లేదంటూ ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి స్పందించారు. బేగంపేటలోని ప్యారడైజ్ రెస్టారెంట్ ప్యాకింగ్ ఛార్జి పేరిట అదనంగా వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల కోర్టులో కేసు వేసిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
వసూలు చేస్తున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ నిద్రపోతున్నారంటూ కామెంట్ చేశారు. అలాగే విశ్వజిత్ కంపాటిని ట్యాగ్ చేశారు. స్పందించిన విశ్వజిత్ కంపాటి ‘మీ పనితీరును గౌరవిస్తాను. ఈ విషయాన్ని సంబంధిత విభాగానికి పంపించాను. ప్రాసెస్ నడుస్తోంది. నేను నిద్రపోవడం లేదు’అని రీట్వీట్చేశారు.