హైదరాబాద్, వెలుగు: అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన 26 మందిపై వాటర్ బోర్డు విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాటర్బోర్డు ఓ అండ్ ఎం(ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) డివిజన్ నం. 19, పీర్జాదిగూడ సెక్షన్ పరిధి సుమతి టవర్స్ అపార్ట్మెంట్లో ఉంటున్న నర్సింగ్ రావుతో పాటు మరో 25 మంది పర్మిషన్ లేకుండా రెండు 25 ఎంఎం, ఒక 20 ఎంఎం సైజుతో పైప్ లైన్ కనెక్షన్లు తీసుకుని నీటిని వాడుకుంటున్నారు.
విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో అక్రమ నల్లా కనెక్షన్ల విషయం బయట పడింది. మొత్తం 26 మందిపై మేడిపల్లి పీఎస్లో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తిస్తే వాటర్ బోర్డు విజిలెన్స్ టీమ్ 9989998100 లేదా 9989992268 నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.