హైదరాబాద్ ను బ్యూటిఫుల్ సిటీగా ఉంచేందుకు GHMC గట్టి చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా ఇక నుంచి రోడ్డుపై చెత్త వేస్తే భారీ జరిమానాలు విధిస్తోంది GHMC. ఇప్పటివరకు ఇలాంటి చర్యలు కాగితాల వరకే ఉండగా..ఇప్పుడు నిజం చేసి చూపిస్తున్నారు. మంగళవారం రోడ్డుపై చెత్త వేసిన ఇద్దరికి రూ.40 వేలు ఫైన్ వేశారు.
చందానగర్ వెంకటాద్రి కాలనీకి చెందిన రవీందర్ రెడ్డికి మంగళవారం భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపై వేసినందుకు రూ. 30 వేల ఫైన్ వేశారు. ఆయనతో పాటు రోడ్డుపై చెత్త వేశాడని.. డస్ట్ బిన్ లను కూడా ఏర్పాటు చేసుకోకపోవడంతో మూసాపేటలోని సాయి బాలాజీ వైన్స్ కు రూ. 10 వేల ఫైన్ వేశారు. రోడ్లపై ఉమ్మినా, చెత్త వేసినా ఫైన్ కట్టాల్సిందేనని చెప్పారు GHMC అధికారులు.