LRS పోవాలంటే GHMC లో TRS కు VRS ఇవ్వాలన్నారు బీజేపీ గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్. గ్రేటర్ లో బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వం LRS పై వెనక్కితగ్గడం ఖాయమన్నారు. రేపు(బుధవారం) బీజేపీ తొలి జాబితా విడుదల చేస్తామన్నారు. బీజేపీలోకి భారీగా వలసలు పెరిగాయన్నారు. 26 విభాగాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
కుట్ర పూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందన్నారు లక్ష్మణ్. సమయం ఎక్కువ ఇస్తే బీజేపీ వాళ్ళు గ్రేటర్ పీఠం తన్నుకుపోతారని టిఆర్ఎస్ భావిస్తోందన్నారు.ఎన్నికల సమయం తక్కువగా ఉన్న… బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. TRS పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పారు. 18 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని…హైదరాబాద్ లో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 428 మందికి మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.ఇటీవల ఓ మంత్రి లక్ష ఇల్లు చూపిస్తామని చెప్పి అభాసుపాలయ్యారన్నారు.
కేసీఆర్ మాట తప్పారని… ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు లక్ష్మణ్. ఆరేళ్లలో TRS ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే..దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చలేదన్నారు. హైదరాబాద్ లోని బస్తీలన్ని చెరువులు గా మార్చిన ఘనత కేసీఆర్ దన్నారు.
TRS కార్యకర్తల దోపిడీ కోసమే డబ్బు రూపంలో వరద సాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మణ్. హైదరాబాద్ ప్రజలు TRS ను నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. GHMC ఎన్నికల్లో గెలిచి…TRS కుట్రలను తిప్పికొడతామన్నారు లక్ష్మణ్.