రాష్ర్ట బడ్జెట్‌లో ప్రభుత్వం మొండిచేయి చూపడంతో బల్దియాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇప్పటికే సిటీలో రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణం తదితర కీలక ప్రాజెక్టులను బల్దియాకు ప్రభుత్వం అప్పగించింది. కానీ బడ్జెట్‌లో నామమాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టింది. ఈసారి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఇస్తుందని అధికారులు ఎదురుచూడగా వారి ఆశలపై నీళ్లు చల్లుతూ సరిగా ఫండ్స్ఇవ్వనేలే దు. అయితే ప్రాజెక్టులకు మూలధన వ్యయం కింద రూ.1,962 కోట్లు మాత్రమే కేటాయించింది. అది కూడా అవసరాన్ని బట్టి సర్కార్ పర్మిషన్‌తోనే తీసుకోవాలనే నిబంధన పెట్టింది. ఎప్పటిలానే వృత్తి పన్ను కింద రూ.10 కోట్లు, ప్రభుత్వ భవనాల అద్దె రూ.7.50 కోట్లు, కాంట్రిబ్యూషన్ ఫండ్స్ పేరిట రూ.10 లక్షలు, శాలరీల కోసం రూ.7.61 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతో బల్దియాకు వచ్చే వాటాపై స్పష్టత లేదు. ఇప్పటికే బల్దియా స్ర్టాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్‌ఆర్‌డీపీ) పనుల కోసం రూ.2, 995 కోట్ల అప్పులు చేసింది. ఇందులో రూ.1,600 కోట్లు ఖర్చు చేసింది. తీసుకున్న అప్పులకు కిస్తీల కింద నెలకు రూ.20 కోట్ల వరకు కడుతుంది. బల్దియాకు వచ్చే ఇన్కమ్కంటే ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో కిస్తీలు కూడా కట్టలేని స్థితిలో ఉంది. ఇక ఏ పని చేపట్టాలన్నా కూడా బల్దియా వద్ద ప్రస్తుతం పైసలు లేవు. దీంతో మళ్లీ అప్పులు చేసేందుకు రెడీ అవుతుంది. మరో 1,000 కోట్లు అప్పులు తీసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అప్పుగా తెచ్చిన పైసలను..
ఎస్ఆర్ డీపీ లో భాగంగా నాగోల్, చెంగిచర్ల, షేక్ పేట్, వీఎస్ టీ, ఓవైసీ ఏరియాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి కోసం ఇప్పటికే రూ.2,995 కోట్ల అప్పులు చేసింది. వీటిలో రూ.1,395 కోట్లు ఉండగా, ఈ పైసలు కూడా ఫ్లై ఓవర్ల పనుల కోసమే ఖర్చు పెట్టాలి. ఇతర పనులకు వినియోగించే అవకాశం లేదు. అయితే ఈ ఫండ్స్కూడా సరిపోకపోతే పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఇప్పటికే బహదూర్ పురా ఫ్లై ఓవర్‌పనులు ముందుకు సాగడం లేదు. బైరామల్ గూడ కుడివైపు ఫ్లై ఓవర్, అంబర్ పేట్ బ్రిడ్జి పనులు ఇంకా మొదలు పెట్టలేదు. బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఇవ్వడం లేదు. పైగా బల్దియా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు బల్దియా నుంచే ఖర్చు చేయిస్తుంది. డబుల్‌బెడ్ ఇండ్లు, ఆర్టీసీకి కూడా జీహెచ్ఎంసీ ఫండ్స్‌నే తీసుకుంటుంది. ఇక ప్రతి ఏటా బడ్జెట్‌లో బల్దియాకు మొండిచేయి చూపుతుంది.
లెటర్లు రాసినా స్పందించలేదు
రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్దంగా బల్దియాకు కేటాయించాల్సిన ఫండ్స్కూడా ఇవ్వడం లేదు. ప్రతిఏటా బడ్జెట్‌లో పెడుతుంది. కానీ ఇవ్వడం లేదు. ఇలాగే చేస్తే సిటీ డెవలప్ మెంట్ఎలా అవుతుం ది. వరదలు వచ్చి ఐదు నెలలవుతున్నా కూడా నాలాల పనులు ఇంకా ప్రారంభిం చడం లేదు. వీటిని వదిలేసి అప్పులు తెచ్చి ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నారు. ఈసారి వరదలు వచ్చినా ఇబ్బందులు రావద్దను కుంటే ముందుగా నాలాల పనులు కంప్లీట్చేయాలి. జీహెచ్ఎంసీకి నిధుల ను కేటాయించాలని బడ్జెట్‌సమావేశాలకు ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్లు రాశాం. అయినా కూడా స్పందించలేదు. తక్షణమే సిటీ డెవలప్ మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు రిలీజ్ చేయాలి. లేకపోతే అభివృద్ధి కాదు.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ