సికింద్రాబాద్, వెలుగు: నాచారంలోని ఓ వైన్ షాపు వద్ద జీహెచ్ఎంసీ కార్మికుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. అతిగా మద్యం సప్లై చేసి చనిపోయేందుకు కారణమయ్యారని మృతుడి కుటుంబ సభ్యులు వైన్ షాపు వద్ద ఆందోళనకు దిగిన ఘటన నాచారం పీఎస్ పరిధిలో శనివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. నాచారానికి చెందిన జీహెచ్ఎంసీ కార్మికుడు కుమార్(55) గురువారం స్థానిక ప్రకృతి వైన్స్‌లో మద్యం తాగి అపస్మారక స్థితికి చేరుకోగా.. వైన్‌షాపు నిర్వాహకులు బయట పడుకోబెట్టి వెళ్లిపోయారు. తెల్లారక చూస్తే అతడు చనిపోయాడు.
కుమార్కుటుంబసభ్యులకు తెలియడంతో వైన్‌షాపు వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. వైన్ షాపు నిర్వాహకులు అతిగా మద్యం పంపిణీ చేయడంతోనే మత్తులోకి వెళ్లగా అక్కడే వదిలిపెట్టి వెళ్లారని, దీంతో కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. అతడి మృతికి వైన్‌షాపు నిర్వాహకులే కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు వెళ్లి మృతుడి కుటుంబసభ్యులకు నచ్చజెప్పి డెడ్‌బాడిని అప్పగించారు. కుమార్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నాచారం ఇన్స్పెక్టర్ తెలిపారు.