గండిపేట, వెలుగు: ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పైనుంచి మిల్లర్ జాకెట్ (బాకెట్) యంత్రం తలపై పడడంతో మహిళ దుర్మరణం చెందింది. గండిపేటకు చెందిన సవల శివలక్ష్మి(51) జీహెఎచ్‌ఎంసీ మున్సిపాలిటీ వర్కర్‌గా పనిచేస్తోంది. ఆమె ఇంటి పక్కన భవన నిర్మాణం జరుగుతుండగా, స్లాబ్ వేయడానికి తెచ్చిన మిల్లర్‌ను రహదారిపై ఉంచారు.
భవనంలోని మూడో అంతస్తుకు పంపిన మిల్లర్ జాకెట్ ప్రమాదవశాత్తు శివలక్ష్మి తలపై పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో బిల్డింగ్ ఓనర్ మల్లేశ్, ఇద్దరు కాంట్రాక్టర్లపై శివలక్ష్మి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. భవన నిర్మాణ సమయంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోక పోవడం తోనే ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.