ఓ కాలేజీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జీహెచ్ఎంసీ కార్మికులు మృతిచెందింది. ఈ ఘటన హైదరాబాద్ రామ్ కోఠిలో సోమవారం ఉదయం (ఆగస్టు 28వ తేదీన) జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. కింగ్ కోఠిలోని రోడ్లును సోమవారం ఉదయం 7 గంటల సమయంలో జీహెచ్ఎంసీ కార్మికురాలు డీ. సునీత శుభ్రం చేస్తోంది. ఇదే సమయంలో మొయినాబాద్ లోని అయాన్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ కు చెందిన కాలేజీ బస్సు విద్యార్థులతో వెళ్తోంది. డ్రైవర్ మహ్మద్ గౌస్ వేగంగా బస్సును నడపడంతో అదుపు తప్పి..రోడ్లను శుభ్రం చేస్తున్న సునీతను ఢీకొట్టింది. డ్రైవర్ వేగంగా బస్సు నడపడం వల్ల స్పాట్ లోనే సునీత చనిపోయింది. ప్రమాదం జరగ్గానే వెంటనే స్థానికులు వెళ్లే సరికి సునీత రక్తపు మడుగులో పడి ఉంది.
వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు .. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. సునీత డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం హైదరాబాద్ ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలు ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్ లో నివాసం ఉంటుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఉదయం కింగ్ కోఠిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు కూడా గాయపడ్డారు. సునీత మృతికి కారణమైన బస్సు డ్రైవర్ మహ్మద్ గౌస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నాడు.