తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత బదిలీ అయ్యారు. ఆమెను నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 13 ఏండ్లుగా కూకట్ పల్లిలో విధులు నిర్వర్తిస్తున్న మమతకు కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చినట్లయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతలతో ఉన్న సంబంధాల కారణంగా జోనల్ కమిషనర్ గా కొనసాగినట్లు ఆరోపణలు వచ్చాయి.
గతంలో జూబ్లీహిల్స్ కు డిప్యూటీ కమిషనర్ గా ట్రాన్స్ ఫర్ చేస్తే.. 24గంటల్లో షేరిలింగంపల్లి సర్కిల్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఎన్నికలకు ముందు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా బదిలీ చేస్తే.. 24గంటల్లో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా బదిలీ చేయించుకున్నారు.
ప్రస్తుతం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ అడిషనల్ డైరెక్టర్ గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో స్నేహా శబరీశ్ ను నియమించింది. మూసీ రివర్ ఫ్రంట్ ఎండీగా జీహెచ్ఎంసీ సూపరింటెండెట్ ఇంజినీర్ వెంకటరమణను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది.