RTC కి GHMC ఎన్ని నిధులు విడుదల చేసిందో చెప్పాలి

RTC కి GHMC ఎన్ని నిధులు విడుదల చేసిందో చెప్పాలి

హైదరాబాద్ : RTC ఆర్థిక అంశాలలో GHMC పాత్ర కూడా పరోక్షంగా ఉందన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. శనివారం సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు రేవంత్. 29 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని..అయినా కూడా ప్రభుత్వం దిగిరాకపోవడం దారుణమన్నారు. RTC ఆర్థిక అంశాలలో GHMC పాత్ర కూడా పరోక్షంగా ఉందన్న ఆయన.. సంవత్సరం వారిగా ఎంత మొత్తంలో ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పాలన్నారు.

RTC కి GHMC నిధులు ఇవ్వాలని నిబంధన ఉందా..లేదా దయాదాక్షిణ్యం మీద ఇవ్వాలా… అనే దానిపై క్లారిటీ కావలని తెలిపారు.  ఆర్టీసీకి GHMC రూ. 1400 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని.. నిధులు ఇచ్చేది లేకుంటే ఇవ్వం అని క్లారిటీ ఇవ్వండన్నారు రేవంత్ రెడ్డి.