హైదరాబాద్, వెలుగు : సిటీలో నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన నైట్ షెల్టర్లను మరిన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తుంది. ఎన్జీవోల సాయంతో ప్రస్తుతం 23 షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి పెంచనున్నారు. ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ వద్ద వెంటనే ఏర్పాటుకు బల్దియా అధికారులు నిర్ణయించారు. ఉన్నతాధికారులు కూడా వీటికి సంబంధించిన రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తే నిరాశ్రయులకు ఉపయోగంగా ఉంటాయన్న దానిపై ఆరా తీస్తున్నారు.
23 షెల్టర్లకి సంబంధించి కూడా ఎంఓయూ పూర్తి కావస్తుండటంతో మరో రెండేళ్లు ఎన్జీవోలు వీటిని కొనసాగించేందుకు జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చింది. సిటీలోని అన్ని షెల్టర్హోమ్స్లో డైలీ 800 మంది వరకు ఉంటున్నారు. ప్రధానంగా సర్కార్ దవాఖానల వద్ద బాగా ఉపయోగపడుతున్నాయి. 5 ఆస్పత్రుల్లో హోమ్స్ కొనసాగుతున్నాయి. ఒక్కోచోట100 వరకు బెడ్స్ ఉన్నాయి. షెల్టర్ హోమ్స్ లో ఉచితంగా భోజనం కూడా అందిస్తారు. నిరాశ్రయులు ఎవరైనా ఉండవచ్చు.