చనిపోయిన వారి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, X అకౌంట్లే.. ఘోస్ట్ హ్యాకర్ల టార్గెట్

చనిపోయిన వారి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, X అకౌంట్లే.. ఘోస్ట్ హ్యాకర్ల టార్గెట్

డిజిటల్ వరల్డ్‌లో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. బుక్ చేసుకున్న వస్తువులు డెలివరీ తీసుకునేటప్పుడు, ఫేక్ కాల్స్ చేసి కేవైసీ అడగటం వంటివి చేస్తూ అకౌంట్లో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు తెలుసుకోడానికి ఎంతకైనా తెగిస్తారు. చనిపోయిన వారి సోషల్ మీడియా అకౌంట్లను టార్గెట్ గా చేసి సైబర్ నేరాలకు పాల్పడే వారిని ఘోస్ట్ హ్యాకర్లు అని అంటారు. వీరు చనిపోయిన వ్యక్తుల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, X వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో  వారి అకౌంట్ లాగ్ ఇన్ డిటేల్స్ తెలుసుకుంటారు. తర్వాత వాటిని ఫ్రాడ్ చేయడానికి ఉపయోగిస్తారు.

సాధారణ హ్యాకర్ల మాదిరిగానే, ఘోస్ట్ హ్యాకర్ల లక్ష్యం కూడా డబ్బు సంపాదించడం లేదా అకౌంట్లను ట్రాప్ చేసి లబ్ధి పొందడమే ఉంటాయి. ఫిషింగ్ కాల్స్, మెస్సేజ్ లు పంపుతారు. ఘోస్ట్ హ్యాకర్లు వారి పని ఈసీ అని అనుకుంటారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేస్తే ఎవరికీ దొరకమని, సులభంగా తప్పించుకోవచ్చని అనుకుంటారు.

ALSO READ : 9 నెలల నుంచి ప్రెగ్నెన్సీ అని నమ్మించింది.. అసలు విషయం తెలిసి అవాక్కయిన డాక్టర్లు..!

చనిపోయాక మీ అకౌంట్లు ఎవరు వాడాలో సెట్ చేసుకోవచ్చు

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, X అకౌంట్లలో సెంన్సిటీవ్ డేటా ఉంటుంది. చనిపోయిన తర్వాత ఈ డేటా హ్యాకర్ల చేతిలోకి వెళ్తే అది మీ దగ్గర వ్యక్తులకు ప్రమాదంగా మారవచ్చు. సోషల్ మీడియా అకౌంట్ డిటేల్స్ ఘోస్ట్ హ్యాకర్లకు చిక్కకుండా ఉండేందుకు కొన్ని ఆప్షన్లను తీసుకొచ్చాయి. సోషల్ మీడయా ఫ్లాట్ ఫాంలో సపోర్ట్ ఇమెయిల్ చేసి చనిపోయిన వాళ్ల సోషల్ అకౌంట్లు క్లోస్ చేయడం, డేటా ఎరైస్ చేయడం వంటివి చేయవచ్చు. లేదా దగ్గరి వ్యక్తులు అయితే వారే అకౌంట్ ను మెయిన్ టెయిన్ చేసుకోవచ్చు. అంతేకాదు.. యూజర్ల మరణించిన తర్వాత వారి ఖాతాను ఎవరు వాడాలో నిర్ణయించుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ సెట్టింగ్‌లకు వెళ్లి మెమోరియలైజేషన్ పై క్లిక్ చేయాలి. తర్వాత లెగసీ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఘోస్ట్ హ్యాకర్లు ఈ ఖాతాను హ్యాక్ చేయలేరు.