కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ఆదివారం మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేసి న్యూఇయర్ విషెస్ చెప్పారు. మూవీలోని కీలక అంశాలు అన్నీ కలిపి థీమ్‌కి తగ్గట్లు ఆసక్తి రేపేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు.
కార్ స్పీడో మీటర్‌తో మొదలై, ఎగిరే బుల్లెట్లు, గన్ ఫైర్ అవగానే కార్ దూసుకు రావడం, వీటికి తోడు అర్జున్ జన్య అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంప్రెస్ చేస్తుంది. శివన్న వింటేజ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్ ఇటీవలే మైసూర్‌లో పూర్తయింది. మూడో షెడ్యూల్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో బెంగళూరులో మొదలుపెట్టనున్నారు. మలయాళ నటుడు జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అచ్యుత్ కుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.