సంజయ్​ని కలిసిన ‘జెయింట్ కిల్లర్’

కరీంనగర్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్​రెడ్డిని ఓడించిన జెయింట్ కిల్లర్, బీజేపీ నేత వెంకటరమణారెడ్డి మంగళవారం సాయంత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు. ఇరువురు అరగంటకుపైగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో తన గెలుపుకు దోహదపడిన అంశాలతోపాటు కార్యకర్తల కృషి, పార్టీ సహకారం వంటి అంశాలపై చర్చించారు.