తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు చెప్పారు. వైసీపీ పార్టీని విడిచి ఎక్కడికి పోనని వెంకట రాంబాబు స్పష్టం చేశారు. ఆరోగ్య కారణంవల్లే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని చెప్పారు. కావాలనే కొందరూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో రాజకీయ భిక్ష పెట్టారని.. ఆయన ఆశీస్సులతో నే తాను మొదటి సారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు అన్నా వెంకట రాంబాబు. పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు.డబ్బు తీసుకొని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని.. కొందరు తన కుటుంబాన్ని టార్గెట్ చేసి కించపరుస్తున్నారని.. కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయ పెద్ద కూడా పట్టీపట్టనట్లు ఉన్నారని అన్నారు.
2024లో తాను పోటీ చేయనని సీఎం జగన్ కూడా చెప్పానని అయితే ఆయన ఒప్పుకోలేదన్నారు రాంబాబు. ఎప్పటికీ సీఎం జగన్ తోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు తెలిపారు.