
వర్ధన్నపేట, వెలుగు: దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని దివ్యాంగుల హక్కుల పరిరరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో జిల్లా అధ్యక్షుడు మహ్మద్ షరీఫ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మీటిం గ్‌లో ఆయన మాట్లాడారు. దివ్యాంగ రిజర్వేషన్లకు ముందుకు రాని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. దివ్యాంగులు రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దివ్యాంగ బంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, ఆసరా పింఛన్ వచ్చే ప్రతి దివ్యాంగుడికి డబుల్ ఇల్లు ఇవ్వాలని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొల్లూరి ఈదయ్య బాబు, వర్ధన్నపేట మండల అధ్యక్షుడు జట్టెబోయిన శ్రీనివాస్, సుధమల్ల రంజిత్‌నాథ్, వర్ధన్నపేట పట్టణ అధ్యక్షురాలు సంధ్య, ఇస్లావత్ బాలకృష్ణ, కక్కిరాలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మహ్మద్ అంకుషావలి పాల్గొన్నారు.