గొప్ప ఆచారం: అరుణాచల్​ ప్రదేశ్​ లో పెండ్లికూతురికి కట్నం!

గొప్ప ఆచారం: అరుణాచల్​ ప్రదేశ్​ లో పెండ్లికూతురికి కట్నం!

మన దేశంలో చాలామంది తల్లితండ్రులు తన కూతురు అత్తారింట్లో సుఖసంతోషాలతో ఉండాలని పెండ్లికొడుక్కి కట్నకానుకలు ఇస్తుంటారు. అయితే అరుణాచల్ ప్రదేశ్​లోని గలో అనే గిరిజన తెగకు చెందిన ప్రజలు మాత్రం పెండ్లి కూతురికి కానుకలు ఇస్తారు. ఈ ఆచారాన్ని అరి అని పిలుస్తారు. ఈ ఆచారంలో భాగంగా పెండ్లి కొడుకు కుటుంబం పెండ్లికూతురికి డబ్బులు, బహుమతులు, ఆస్తులు ఇస్తుంది. 

అంటే డబ్బులిచ్చి కొనుక్కోవడం అని కాదు వాళ్ల ఉద్దేశం. ఆడపిల్ల తన ఇంటికి వస్తుందని.. ఆమెను ఎంతో గౌరవిస్తూ ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇది వాళ్ల కమ్యూనిటీలో తరతరాలుగా వస్తోన్న ఆచారం. ఎందుకంటే.. ‘‘ఒక కుటుంబం తన ఇంట్లో ఒక మనిషిని కోల్పోతున్నప్పుడు ఆర్థికంగా నష్టపోతారు. దాంతోపాటు రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండాలంటే అరి ఆచారాన్ని పాటించాలి”అని వాళ్లు నమ్ముతారు. వీళ్ల వ్యవస్థలో సామాజిక సామరస్యం, లింగ సమానత్వం కీలకపాత్ర పోషిస్తుంది. ఈ అరి ఆచారం వల్ల సొసైటీలో మహిళ హోదాను మెయింటెయిన్ చేయడానికి సాయపడుతుంది.