ఉద్యోగం పోయినోళ్లకు నయా జాబ్స్..

ఉద్యోగం పోయినోళ్లకు నయా జాబ్స్..

ఉద్యోగం పోయినోళ్లకు గిగ్​ జాబ్స్​ రెడీ

బ్లూకాలర్ వర్కర్లలో 30-35 శాతం గిగ్‌‌ రోల్స్‌‌లోకే

గిగ్ ఆఫర్ చేస్తోన్న కంపెనీల్లో ఓలా, జొమాటో, ఫ్లిప్‌‌కార్ట్‌‌లు

డెలివరీలోనే ఎక్కువ డిమాండ్

న్యూఢిల్లీ: ఉద్యోగాలు పోతున్నాయని బ్లూకాలర్ వర్కర్లు ఆందోళన పడ్డాల్సినవసరం లేదు. గిగ్ బేసిస్‌‌లో కంపెనీలు జాబ్ ఆఫర్లు ఇస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. ఉద్యోగాలు కోల్పోయిన బ్లూకాలర్ వర్కర్లలో 30–35 శాతం మంది గిగ్ రోల్స్‌‌లోకి వెళ్తున్నారని హైరింగ్ సంస్థలు అంచనావేస్తున్నాయి. ముంబైలో ఎయిర్‌‌‌‌ కండీషనర్ సర్వీసు చేసే వసీమ్ అన్సారీ మార్చి–జూన్ మధ్య కాలంలో నెలకు రూ.14 వేల వరకు సంపాదించేవాడు. కానీ కరోనా మహమ్మారితో ఈసారి అన్సారీ ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తొలి నాళ్లలో సొంతూరికి వెళ్లాడు. కానీ నెలవారీ ఇన్‌‌కమ్ లేకుండా కుటుంబాన్ని పోషించడం కష్టమని భావించి, మళ్లీ జూన్‌‌లో ముంబై వచ్చేశాడు. ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీలో గిగ్ రోల్‌‌లో ఉద్యోగం దొరికింది. కరోనాతో ఉపాధి కోల్పోయిన చాలా ఇండస్ట్రీల ఉద్యోగులు ప్రస్తుతం ఈకామర్స్, ఫుడ్ డెలివరీ వాటిలో గిగ్ ఉద్యోగులుగా చేరుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం రాబోతున్న ఫెస్టివ్ సీజన్ డిమాండ్‌‌ను దృష్టిలో ఉంచుకుని గిగ్ బేసిస్‌‌లో 55 వేల ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. ఉద్యోగాలు కోల్పోయిన బ్లూకాలర్ ఉద్యోగులు దీనిని ఒక అవకాశంగా మలుచుకుని ఎంప్లాయీమెంట్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటి వరకు 10 మిలియన్ మంది బ్లూకాలర్ వర్కర్ల ఉద్యోగాలు పోయాయి. వీరిలో 30–35 శాతం మంది గిగ్ రోల్స్‌‌లో ఉద్యోగం పొందినట్టు హైరింగ్ సంస్థ​లు అంచనావేస్తున్నాయి. చాలా మంది ఇండివిడ్యువల్స్ కూడా తమ  సొంత పట్టణాల్లోనే గిగ్ రోల్స్‌‌ కోసం చూస్తున్నట్టు గిగ్‌‌ఇండియా కోఫౌండర్, సీఈవో సహిల్ శర్మ తెలిపారు. ఇప్పటి వరకు గిగ్ రోల్స్‌‌ను హైర్ చేసుకోని ట్రెడిషినల్ కంపెనీలు కూడా దీన్ని ఎంపిక చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గత మూడు నెలల్లో గిగ్ ఇండియా 2 వేల మంది గిగ్ వర్కర్లకు ఎంప్లాయిమెంట్ అవకాశాలు కల్పించినట్టు శర్మ చెప్పారు.

గిగ్ రోల్స్‌‌ను ఆఫర్ చేసే సంస్థలేవి…?

ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌‌కార్ట్, అమెజాన్ లాంటి చాలా కంపెనీలు గిగ్‌‌ రోల్స్‌‌ను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని సంస్థలు కూడా తమ ప్లాన్స్‌‌ను ప్రకటించాయి. ఈ–కామర్స్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్ త్వరలో రాబోతున్న ఫెస్టివ్ సేల్ బిగ్ బిలియన్ డేస్ కోసం 70 వేల మందిని నియమించుకోనున్నట్టు తెలిపింది. ఇన్‌‌డైరెక్ట్‌‌గా కూడా వేలమందిని నియమించుకుంటానని చెప్పింది.  ఫ్లిప్‌‌కార్ట్ సప్లయి చెయిన్‌‌లో డైరెక్ట్ జాబ్ అవకాశాలను కల్పిస్తానని పేర్కొంది. అంటే వాటిలో ఫ్లిప్‌‌కార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌‌లు, ప్యాకర్స్, సార్టర్స్ ఉంటారు. అదనంగా కల్పించే ఇన్‌‌డైరెక్ట్ జాబ్స్‌‌ను ఫ్లిప్‌‌కార్ట్ సెల్లర్ పార్టనర్ లొకేషన్స్, కిరాణాల్లో ఇప్పించనుంది. లాజిస్టిక్ ప్రొవైడర్ ఈకామ్ ఎక్స్‌‌ప్రెస్ కూడా సెప్టెంబర్, అక్టోబర్‌‌‌‌ నెలల్లో తన ఫుల్‌‌ఫిల్‌‌మెంట్ సెంటర్లు, హబ్స్, డెలివరీ సెంటర్లలో 30 వేల సీజనల్ ఎంప్లాయిమెంట్‌‌ను క్రియేట్ చేయనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం క్రియేట్ చేసే ఉద్యోగాల్లో నాలుగింట మూడు వంతుల హైరింగ్ అహ్మదాబాద్, సూరత్, విజయవాడ, చండీఘర్, ఇండోర్, పాట్నా, లక్నో, కాన్పూర్, భోపాల్, జైపూర్ వంటి ప్రాంతాల్లో ఉండనుందని చెప్పింది.

గిగ్​ జాబ్స్​ అంటే..

గిగ్ ఉద్యోగులు అంటే సీజనల్ డిమాండ్ ప్రకారం తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేసే వారు. వీరిని కంపెనీలు తాత్కాలికంగా కొన్ని పనుల కోసం తీసుకుంటాయి. ఆ పని పూర్తయ్యాక వీరిని  తొలగిస్తాయి.

పాపులర్ రోల్స్ ఏమిటి..?

డెలివరీ పర్సనల్‌‌ టాప్‌‌ మోస్ట్ రోల్‌‌గా ఉంది. దీని తర్వాత  సార్టింగ్ గూడ్స్, ప్యాకేజింగ్, లేబులింగ్ వంటి లాజిస్టిక్స్ రోల్స్‌‌కు ఎక్కువ డిమాండ్ ఉంది. పెద్ద ట్రక్కుల డ్రైవర్లు కూడా పాపులర్‌‌‌‌గా ఉన్నాయి. ఈకామ్ ఎక్స్‌‌ప్రెస్‌‌లో మెజార్టీ నియామకాలు డెలివరీ పర్సనల్, హబ్, సార్టింగ్ సెంటర్ అసోసియేట్స్, వేర్‌‌‌‌హౌసింగ్ యాక్టివిటీస్ వర్క్‌‌ఫోర్స్‌‌గా ఉండనున్నాయి.

For More News..

ఈ సీజన్ ఐపీఎల్‌లో సచిన్ కొడుకు ఆడే చాన్స్!