పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగం కావాలంటున్న గిగ్ వర్కర్లు..సైల్ హెచ్‌‌‌‌ఆర్ సర్వేలో వెల్లడి

పర్మినెంట్‌‌‌‌ ఉద్యోగం కావాలంటున్న గిగ్ వర్కర్లు..సైల్ హెచ్‌‌‌‌ఆర్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: తాత్కాలిక ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే వారిలో (గిగ్‌‌‌‌ వర్కర్లలో) ఎక్కువ మంది ఫుల్  టైమ్ వర్క్‌‌‌‌ కోసం చూస్తున్నారు. గిగ్‌‌‌‌ వర్క్‌‌‌‌లో జాబ్ సేఫ్టీ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించారు. సైల్‌‌‌‌ హెచ్‌‌‌‌ఆర్ సర్వీసెస్ చేసిన సర్వే ప్రకారం,  50 శాతం మంది గిగ్‌‌‌‌ వర్కర్లు ఫుల్ టైమ్‌‌‌‌ వర్క్‌‌‌‌కు షిఫ్ట్ అవుతామని పేర్కొన్నారు. మొత్తం 400 కంపెనీల్లో పనిచేస్తున్న 1,200 మంది వైట్ కాలర్ (ఆఫీసుల్లో జాబ్ చేసేవారు)  గిగ్‌‌‌‌ వర్కర్ల నుంచి  అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేను కంపెనీ చేపట్టింది. ‘గిగ్ వర్క్‌‌‌‌కు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరుగుతోంది. అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులు తమ కెరీర్‌‌‌‌‌‌‌‌లో దీనిని ఒక ఫేజ్‌‌‌‌గానే చూస్తున్నారు. పర్మినెంట్‌‌‌‌, ఫుల్‌‌‌‌ టైమ్ ఉద్యోగం పొందాలనే ఆలోచనలో ఉన్నారు’ అని సైల్ రిపోర్ట్ పేర్కొంది.

 వివిధ ప్రాజెక్ట్‌‌‌‌లలో పనిచేయడానికి 41 శాతం మంది మగవారు, 40 శాతం మంది మహిళలు ఎక్కువ ఆసక్తి చూపించారని వెల్లడించింది. జెండర్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా వివిధ గిగ్‌‌‌‌ వర్క్‌‌‌‌లను చేయడానికి ఉద్యోగులు ముందుకొస్తున్నారని తెలిపింది. తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనని  32 శాతం మంది గిగ్‌‌‌‌ వర్కర్లు ఆందోళనపడుతున్నారు. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ లేకపోవడాన్ని పెద్ద సమస్యగా 24 శాతం మంది చూస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి వీలుగా ఉండడంతో  కంపెనీలు  గిగ్‌‌‌‌ వర్క్‌‌‌‌ విధానం వైపు చూస్తున్నాయని సైల్‌‌‌‌ హెచ్ఆర్‌‌‌‌‌‌‌‌ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య నారాయణ్ మిశ్రా అన్నారు. కానీ, గిగ్‌‌‌‌ వర్కర్లు మాత్రం తమ ఉద్యోగాల్లో స్టెబిలిటీ ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. దీన్ని కంపెనీలు బ్యాలెన్స్‌‌  చేయాల్సి  ఉంటుందని అభిప్రాయపడ్డారు.