ప్రమాదం ముంచుకొస్తుందా?: అంటార్కిటికాలో పగిలిన ఏ-83 మంచుకొండలు 

–దాదాపు అంతా మంచుతో కప్పబడి ఉండే ప్రాంతమే అంటార్కిటికా. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అక్కడ మంచు కొండలు కరిగిపోతున్నాయి. అంటార్కిటికాలో దాదాపు 380 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న భారీ మంచుకొండకు పగళ్లు ఏర్పడి రెండుగా చీలిపోయింది. దీని పరిమాణం ఢిల్లీతో పోల్చితే నాలుగింతలు ఉంటుంది. సైంటిస్టులు ఈ మంచుకొండకు ఏ-83గా పేర్కొంటున్నారు. మే 20న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ‘కకోపర్నికస్‌ సెంటినల్‌-1’ శాటిలైట్‌ ఫొటోలు విడుదల చేసింది.

త్రిభుజాకారంలో ఉన్న ఏ-83 మంచుకొండ మే 22నాటికి పూర్తిగా చీలిపోయినట్టు శాటిలైట్‌ విడుదల చేసిన రాడార్‌ చిత్రాలు చెబుతున్నాయి. అంటార్కిటికాలోని ఈ ప్రాంతంలో భారీ మంచు కొండలకు పగుళ్లు రావటం గత నాలుగేండ్లలో ఇది మూడోసారి. ‘మెక్‌డొనాల్డ్‌ ఐస్‌ రంపెల్స్‌’గా పిలుస్తున్న ప్రాంతంలో మంచు కరగటమే ఈ పరిణామానికి కారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. అంటార్కిటికాలో మంచు గడ్డలు కరగడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు.