- 2030 నాటికి 500 గిగావాట్లు
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రస్తుతం 200 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతున్నదని, దాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు సోలార్ ఎనర్జీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గుజరాత్ లోని కచ్‌లో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ పనులు పూర్తి కావొచ్చాయని, ఇందులోనుంచి 200 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు అందుతుందని తెలిపారు.