కరోనా వైరస్ అత్యవసర చికిత్సలో ప్రస్తుతం రెమిడెసివిర్ అనే మెడిసిన్ ను ఉపయోగిస్తోంది. ఈ రెమిడెసివిర్ ను సరికొత్త రూపంలో తీసుకొచ్చేందుకు గిలీడ్ సైన్సెస్ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్న ఈ మందును ఇన్ హేలర్ రూపంలో తీసుకొచ్చేందుకు పరీక్షలను ప్రారంభించింది.
18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న 60 మందిని ప్రయోగాలకు ఎంపిక చేసినట్టు తెలిపారు గిలీడ్ సైన్సెస్ ప్రతినిధి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే కరోనా రోగులు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. నెబులైజర్ సాయంతో ఈ మందును రోగికి ఇస్తారని తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన భాగంలోనే మొదట నయం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ మందు మార్కెట్లోకి వస్తే రోగులకు చాలా మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు.