IPL 2025: ఓపెనర్లుగా ఆరెంజ్ క్యాప్ వీరులు.. ఇద్దరూ కలిస్తే విధ్వంసమే!

IPL 2025: ఓపెనర్లుగా ఆరెంజ్ క్యాప్ వీరులు.. ఇద్దరూ కలిస్తే విధ్వంసమే!

ఐపీఎల్ 2025 సీజన్ లో బెస్ట్ ఓపెనింగ్ జోడీ ఎవరంటే గుజరాత్ టైటాన్స్ దే. ఈ సీజన్ ఐపీఎల్ లో గుజరాత్ కు ఓపెనింగ్ అదిరిపోయింది. ఇంగ్లాండ్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్ తో పాటు టీమిండియా యువ సంచలనం శుభమాన్ గిల్ గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. గతంలో ఆరెంజ్ క్యాప్ వీరులు ఈసారి కలిసి ఆడనుండడంతో ఈ జోడీపై ఆసక్తి నెలకొంది. వీరిద్దరిలో ఒక్కరు నిలబడినా మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడడం ఖాయం. ఒకవేళ ఇద్దరు క్రీజ్ లో కుదురుకుంటే ఇక విధ్వంసమే.

మూడు సీజన్ లుగా శుభమాన్ గిల్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. 2023 ఐపీఎల్ లో 891 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. గిల్ ప్రదర్శనతో గుజరాత్ గత సీజన్ లో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. మెగా ఆక్షన్ కు ముందు రూ. 16.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. 2024 సీజన్ లో గిల్ తన బ్యాటింగ్, కెప్టెన్సీతో పర్వాలేదనిపించినా స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ రానున్న సీజన్ సీజన్ లో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు.

బట్లర్ విషయానికి వస్తే గత కొన్ని సీజన్ లుగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ వచ్చిన బట్లర్.. ఐపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరపున తొలిసారి ఆడబోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బట్లర్ ను రిటైన్ చేసుకోకపోవడంతో ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ ను ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో గుజరాత్ టైటాన్స్ 15.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గత సీజన్ లో నిరాశపర్చిన బట్లర్ రానున్న సీజన్ లో అదరగొట్టడానికి రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న బట్లర్ ఒకసారి క్రీజ్ లో కుదురుకుంటే ప్రత్యర్థులను వణికించగలడు. 2022 లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ ఇంగ్లీష్ బ్యాటర్ గిల్ తో కలిస్ ఎలాంటి ఆరంభాలను ఇస్తాడో చూడాలి. 

ALSO READ : IPL 2025: హెలికాఫ్టర్ షాట్ అదిరింది.. పతిరానా యార్కర్‌ను సిక్సర్ కొట్టిన ధోనీ

గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ పటిష్టంగా కనిపిస్తుంది. సీజన్ తొలి మ్యాచ్ ను మంగళవారం (మార్చి 25) పంజాబ్ కింగ్స్ తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.  మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో బలమైన బౌలింగ్ లైనప్ ఉంది. వరల్డ్ క్లాస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎలాగో జట్టులో ఉన్నాడు. గిల్, బట్లర్, సాయి సుదర్శన్ టాప్ ఆర్డర్.. టివాటియా, గ్లెన్ ఫిలిప్స్ ఫినిషింగ్ బాధ్యతలు మోయనున్నారు. 

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 అంచనా:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్/గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్,  రబడా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ (ఇంపాక్ట్ ప్లేయర్)