
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో టీమిండియాను గెలిపించిన రోహిత్ శర్మ తన ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. బుధవారం విడుదలైన ఐసీసీ వన్డే బ్యాటర్ల తాజా జాబితాలో ఐదు నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. నాలుగో ప్లేస్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఐదో ర్యాంక్‌కు పడిపోయాడు. ఈ జాబితాలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 784 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇండియా నుంచి గిల్, రోహిత్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (8) నలుగురు చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఫిబ్రవరి నెలకు గాను గిల్‌కు ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు దక్కింది.