మోదీ పరివార్ లో ఓ లేడీ.. మళ్లీ మెలోడి వైరల్

భారతీయ జనాతా పార్టీ సోమవారం ట్విటర్  వేదికగా ఆ పార్టీ ఈ క్యాంపెయిన్ ను లాంచ్ చేసింది. దీంట్లో భాగంగా బీజేపీ అగ్ర నేతలు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్  సింగ్, అనురాగ్  ఠాకూర్  తమ పేరు పక్కన ‘మోదీ కా పరివార్’ అని పెట్టుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలొని తన ఎక్స్ అకౌంట్ బయోలో మెదీకా పరివార్ అని యాడ్ చేసుకుందని ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అది మెలోడి అని హెడ్డింగ్ లో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. నిజం ఏంటంటే ఇటలీ ప్రధాని జార్జియా తన ఎక్స్ బయోలో మోదీ కా పరివార్ అని యాడ్ చేసుకోలేదు. కావాలనే కొందరు ఎడిట్ చేసి  ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

ALSO READ :- మార్చి 6న విజయ ఏకాదశి.. ఆరోజున ఏ దేవుడిని ఎలా పూజించాలంటే..

 యూఏఈ దుబాయ్ వేదికగా ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు( COP28) ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరయ్యారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రధాని నరేంద్రమోడీ సెల్ఫీ తీసుకున్నారు. అది అప్పుడు  ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయింది. జార్జియా మెలోని, ప్రధాని మోడీతో దిగిన సెల్ఫీని ‘మెలోడీ’ హాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీన ఈ పోస్టుని రీట్వీట్ చేస్తూ.. స్నేహితులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని రాశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో మెలోడి పదం బాగా ట్రెండ్ అయింది.