నెహ్రూ నేషనల్ జూలాజికల్ పార్క్‌లో ఎందరినో అలరించిన మగ జిరాఫీ.. అక్టోబర్ 28న చనిపోయినట్లు డిప్యూటీ డైరెక్టర్, వెటర్నరీ డాక్టర్ MA హకీం తెలిపారు. హైదరాబాద్‌లోని జూ పార్క్ ఆడ, మగ రెండు జిరాఫీలు ఉండేవి. వాటిలో 20ఏళ్ల బసంత్ అనే మగ జిరాఫీని అనారోగ్యంతో చనిపోయింది. బసంత్ గత రెండు సంవత్సరాలుగా వెటర్నరీ డాక్టర్ల నిరంతర సంరక్షణలో ఉంది. వృద్ధాప్య సమస్యలు, ఆర్థరైటిస్ వంటి అనారోగ్యం సమస్యలతో పోరాడుతుంది.
బసంత్ న్యూ ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్క్‌లో 2004లో జన్మించింది. అందుకే దాని పేరు సునామీ బసంత్ అని పెట్టారు. 2009లో జంతు మార్పిడిలో భాగంగా హైదరాబాద్‌లోని జూ పార్క్‌కు దాన్ని తీసుకువచ్చారు. బసంత్ మృత్యువాత పడటంతో నెహ్రూ జూ పార్క్ లో ఇప్పుడు సన్నీ అనే మరో మగ జిరాఫీ మాత్రమే ఉంది. బసంత్ ని పోస్ట్ మార్టం కోసం వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కు పంపారు.
ALSO READ | హైదరాబాద్ జూపార్క్ 61వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నెహ్రూ జూ పార్క్ డైరెక్టర్, క్యూరేటర్, డాక్టర్ సునీల్ ఎస్ హిరేమత్ సిబ్బందితో కలిసి బసంత్‌కు పూలమాలలు వేశారు. నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌లో ప్రస్తుతం 55 జాతులకు చెందిన 664 క్షీరదాలు, 97 జాతులకు చెందిన 1,227 పక్షులు, 38 జాతులకు చెందిన 341 సరీసృపాలు మరియు 2 జాతులకు చెందిన 8 ఉభయచరాలు సహా మొత్తం 2240 జంతువులు ఉన్నాయి.