కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో ఈనెల 5న నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు శ్రీ ఆత్మరాం మహరాజ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుట్ట నుంచి జేఎన్టీయూ మీదుగా రాంసాగర్, మద్దుట్ల, నూకపల్లి, మల్యాల మీదుగా 18 కి.మీ మేర ప్రదక్షిణ చేయనున్నట్లు చెప్పారు. గిరిప్రదక్షిణ ఆలయ చరిత్రలో మొదటిసారి అని శ్రీఆత్మరాం మహరాజ్తెలిపారు.