సెక్రటేరియెట్ అసోసియేషన్  ప్రెసిడెంట్ గా గిరి శ్రీనివాస్ రెడ్డి

సెక్రటేరియెట్ అసోసియేషన్  ప్రెసిడెంట్ గా గిరి శ్రీనివాస్ రెడ్డి
  • 11 మంది ఆఫీస్​ బేరర్లు.. 31 మంది ప్రతినిధుల ఎన్నిక

హైదరాబాద్​, వెలుగు : బీఆర్​ అంబేద్కర్ సెక్రటేరియెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్​గా గిరి శ్రీనివాస్​ రెడ్డి ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఆఫీస్​ బేరర్లు, డిపార్ట్​మెంట్ ప్రతినిధులకు శనివారం ఎన్నికలు నిర్వహించగా.. ఆదివారం ఫలితాలను వెల్లడించారు. మొత్తం 11 మంది ఆఫీస్ ​బేరర్లు, 31 మంది డిపార్ట్​మెంట్ ​ప్రతినిధులను ఎన్నుకున్నారు. అసోసియేషన్​ వైస్​ ప్రెసిడెంట్​(జనరల్​)గా ఎం.నవీన్​కుమార్, వైస్  ప్రెసిడెంట్ (విమెన్​) ఐషా తబస్సుమ్​ఎన్నికయ్యారు.

జనరల్ సెక్రటరీగా జె.ప్రేమ్ (దేవేందర్​), అడిషనల్​ సెక్రటరీగా రాము భూక్యా, జాయింట్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) కె.శ్రీనివాస్​ రెడ్డి, జాయింట్​ సెక్రటరీ (విమెన్​) ఎల్.నీరజాక్షి, జాయింట్​సెక్రటరీ (స్పోర్ట్స్​) డి.వంశీధర్​ రెడ్డి, జాయింట్ సెక్రటరీ (కల్చరల్​) యామిని కనక తార, జాయింట్​సెక్రటరీ (పబ్లిసిటీ) పి. రాజేశ్వర్​, ట్రెజరర్​గా వి. కైలాసం ఎన్నికయ్యారు.