ములుగు, వెలుగు : విజయదశమి అంటేనే విజయానికి చిహ్నమని, సమాజంలో ఎల్లప్పుడు ధర్మం మాత్రమే విజయం సాధిస్తుందని రిటైర్డ్ ప్రొఫెసర్, సామాజిక గన్నమరాజు గిరిజామనోహర్ బాబు అన్నారు. ధర్మజాగరణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో దసరా పురస్కరించుకొని సోమవారం ములుగులోని సాధన స్కూల్ సమీపంలో నిర్వహించిన రావణాసురవధ కార్యక్రమానికి గిరిజనా మనోహర్ బాబు ముఖ్య వ్యక్తగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సాహితీవేత్త గిరిజామనోహర్ బాబు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి, చెడులకు వ్యత్యాసాన్ని తెలపాలని అప్పుడే సమాజంలో నేరాలు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు టి.వెంకటేశ్వర్, హరికృష్ణ, తాజోద్దీన్, రావణాసురవధ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గండ్రకోట కుమార్, స్వాగత నిర్మాణ కమిటీ సభ్యులు సైకం శ్రీకాంత్ రెడ్డి, సుంకరి రవి, కనుకుల చంద్రారెడ్డి, గంగిశెట్టి శ్రీనివాస్, బీస రమేష్, చింతనిప్పుల భిక్షపతి, సల్లగొండ పద్మాకర్ రెడ్డి, శీలం మధు, గండ్రకోట రవీందర్, పెట్టెం రాజు, సముద్రాల రఘు పాల్గొన్నారు.