బసవేశ్వర ప్రాజెక్టు దగ్గర డాన్సులు చేయండి: గిరిజ శెట్కార్

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి బాగా జరుగుతుందని డ్యాన్సులు చేస్తున్నాడని, ఆ డాన్సులు బసవేశ్వర ప్రాజెక్టు వద్ద చేయాలని గిరిజ శెట్కార్ ఎద్దేవా చేశారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఉమ్మడి ఏపీ, ఏఐసీసీస్​ ఇన్‌‌‌‌చార్జి అబ్జర్వర్ సీడీ మయప్పన్ తో కలిసి మాట్లాడారు. నియోజకవర్గంలో బసవేశ్వర ప్రాజెక్టు అనేది ఉత్త ముచ్చటేనని సీఎం కేసీఆర్ ఒకసారి, అల్లుడు హరీశ్ రావు ఒకసారి శంకుస్థాపన చేసి ఇప్పటివరకు తట్ట మట్టి కూడా తీయలేదని ఆరోపించారు.  

ప్రస్తుతం తండాల్లో, గ్రామాల్లో బీఆర్ఎస్ లీడర్లని, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని ప్రజలు తిరిగి పంపిస్తున్నారని, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నామినేషన్ వేసే ముందు ప్రజలకు ఏం చేశాడో శ్వేతపత్రం విడుదల చేసి నామినేషన్ వేయాలన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్​శెట్కార్, యువ నాయకులు సాగర్ శెట్కార్, తాహెర్ అలీ, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 

ALSO READ : నిజామాబాద్​ నేతల అభిమానానికి కృతజ్ఞుణ్ని : షబ్బీర్ ​అలీ