కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లు అంటే ఖాళీ కుర్చీలు అని, బీఆర్ఎస్ మీటింగ్ అంటే జననీరాజనాలని మంత్రి హరీష్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ కు మద్దుతుగా హరీష్ రావు రోడ్ షోలో పాల్గొన్నారు. తెలంగాణ రాకముందు మానుకోట ఎలా ఉండేదో ఇవాళ ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని కోరారు. రేవంత్ రెడ్డి కి బూతులు తప్ప భవిష్యత్ తెలియదన్నారు. కేసీఆర్ అంటే మాట తప్పని వాడు మడమ తిప్పని నాయకుడిని కొనియాడారు. ప్రజలు రిస్క్ చేయొద్దని కారుకే ఓటేయాలని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కరెంటు, నీళ్ల కష్టాలు ఉండేవన్నారు మంత్రి హరీష్ రావు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ ఏమి చేసిందో చూడాలన్నారు. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేసిందని ఆరోపించారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు రూ. 15 వేలు అంటుంటే... అదే కేసీఆర్ ప్రతీ ఎకరాకు రూ. 16 వేలు అంటున్నారని చెప్పారు. గిరిజనులకు అత్యధికంగా సీట్లు ఇచ్చింది కేసీఆర్ అని చెప్పిన మంత్రి.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గిరిజన బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.