ఛత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ గుధియారీలో దారుణం జరిగింది. ఓ 16 ఏళ్ల బాలికను 47 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లిండు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనపై విమర్శలు రావడంతో పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు.
‘రాయ్ పూర్ లోని గుధియారీలో నిందితుడు ఓంకార్ తివారీ అలియాస్ మనోజ్ కిరాణ్ షాపు నిర్వహిస్తున్నాడు. బాలిక ఆ దుకాణంలో పనిచేస్తుంది. కొన్ని రోజుల నుంచి నిందితుడు మనోజ్ పెళ్లి చేసుకోవాలని ఆ బాలికపై ఒత్తిడి చేస్తున్నాడు. దీనికి ఆ బాలికతో పాటు ఆమె తల్లి కూడా ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన మనోజ్ మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి జుట్టు పట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ వీడియో వైరల్ కావడతో పోలీసులు నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. తీవ్ర గాయాలైన బాలికను ఆస్పత్రికి తరలించాం. ఆమె కోలుకున్న తర్వాత ఆమె వాంగ్మూలాన్ని బట్టి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది’ అని రాయ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు.