ఆసిఫాబాద్, వెలుగు: గ్రామ సర్పంచ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆసిఫాబాద్జిల్లా కరమెరి మండలం కెస్లాగూడ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కెరమెరి మండలంలోని కేస్లాగూడకు చెందిన బాలిక(17) ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. అదే గ్రామానికి సర్పంచ్ గా ఉన్న గుణవంత్ రావుతో ప్రేమ వ్యవహారం నడిచింది. ఇటీవల వీరి మధ్య గొడవ జరిగింది. గుణవంత్ రావు తనను మోసం చేశాడని మనస్తాపం చెందిన బాలిక సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబీకులు జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతిచెందింది.
For More News..