పేరెంట్స్ మందలించారని బాలిక సూసైడ్

తుంగతుర్తి, వెలుగు : పేరెంట్స్ మందలించారని బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లిలో శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లంపల్లి గ్రామానికి చెందిన చింతల పూజిత (17) ఇంటర్మీడియట్  చదువుతోంది. బాగా చదువుకోవాలని పేరెంట్స్  మందలించడంతో పూజిత మనస్తాపానికి గురై  పురుగుల మందు తాగింది.

గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పూజిత చనిపోయింది. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై అంజిరెడ్డి తెలిపారు.