10 రోజుల్లో పెండ్లి .. అంతలోనే యువతి ఆత్మహత్య

చందుర్తి, వెలుగు:  మరో  పది రోజుల్లో పెళ్లి ఉండగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం గోస్కులపల్లెకి చెందిన మూదం విద్యశ్రీ(25) హైదరాబాద్‌లో సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్‌. మణికొండ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు వేములవాడకు చెందిన యువకుడితో ఈనెల 17న పెండ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి కావాల్సిన షాపింగ్ కూడా ఆదివారం పూర్తిచేశారు. 

కాగా, సోమవారం సాయంత్రం హాస్టల్‌లోని బాత్​రూంలో విద్యశ్రీ ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో ఆమె స్నేహితులకు సమాచారమిచ్చారు. దీంతో వారు యువతి రూమ్ కి వెళ్లి చూడగా బాత్​రూంలో ఉరేసుకొని అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే వారు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం అర్ధరాత్రి చనిపోయింది. యువతి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.