
లోకేశ్వరం, వెలుగు: తాత చనిపోయాడనే బెంగతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్‌జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన గద్దల దీపిక(17) ప్రైవేట్‌కాలేజీలో డిగ్రీ చదువుతోంది. తాత పెద్ద ముత్తన్నతో ఆమెకు అనుబంధం ఎక్కువ. పది రోజుల క్రితం ముత్తన్న గుండెపోటుతో చనిపోయాడు. ఆదివారం చెరువు దగ్గరకు వెళ్లిన దీపిక ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూశారు. చెరువుగట్టున ఆమె చెప్పులు కనిపించాయి. చెరువులో పరిశీలించగా డెడ్‌బాడీ కనిపించింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్చెప్పారు.